: గోరఖ్ పూర్ వెళ్తుండగా రైలులోనే మృతి చెందిన ఖమ్మం వాసి!


కాన్పూర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఖమ్మం పట్టణానికి చెందిన మేడిపల్లి రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ, రమేష్ తన భార్య లీలావతితో కలిసి గోరఖ్ పూర్ వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుందని చెప్పారు. ఆయన మృతదేహాన్ని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. కాగా, స్థానికంగా మాట్లాడే భాష తెలియకపోవడంతో రమేష్ భార్య లీలావతి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషాద సమాచారం తెలుసుకున్న రమేష్ కుటుంబ సభ్యులు సాయం కోసం అర్థిస్తున్నారు.

  • Loading...

More Telugu News