: జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రాణాలు కాపాడుకోవాలంటే మా ఉగ్రవాద సంస్థలో చేరాలి: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్
జమ్మూకశ్మీర్‌లోని భద్రతా దళాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ యాసిన్ యటూ ఓ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో యాసిన్ యటూతో పాటు మరో ఇద్దరు ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. జమ్మూకశ్మీర్ పోలీసుల ప్రాణాలు దక్కాలంటే తమ ఉగ్రవాద సంస్థలో చేరాలని ఈ వీడియోలో యాసిన్ అన్నాడు. వీటితో పాటు పలు హెచ్చరికలు చేశాడు. అలాగే, కశ్మీర్ లోయలో భద్రతా దళాలపై కాల్పులు జరుపుతూ రెచ్చిపోతున్న ఆందోళనకారులను యాసిన్ యటూ కొనియాడారు.