: రాష్ట్రపతి భవన్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌!


త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్డీఏ త‌మ అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దించుతుందనే అంశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ రాష్ట్రపతి భవన్‌కు రావడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. రాష్ట్ర‌ప‌తి ప్రణబ్ ముఖ‌ర్జీ, మోహ‌న్‌ భగవత్ కలిసి లంచ్‌ చేశారు. వారిరువురూ మర్యాదపూర్వకంగానే క‌లిశార‌ని రాష్ట్రపతి భ‌వ‌న్ వర్గాలు చెబుతుండ‌గా, రాష్ట్ర‌ప‌తి ఆహ్వానం మేరకే భగవత్ అక్క‌డ‌కు వెళ్లినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్త‌రాఖండ్‌లోని రుద్రపూర్‌కు వ‌చ్చిన‌ మోహన్‌ భగవత్‌.. అక్క‌డి నుంచి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని క‌లిశారు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్డీఏ మోహన్‌ భగవత్‌ను నిల‌ప‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 

  • Loading...

More Telugu News