: నెల్లూరు జిల్లాలో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నేతలు
నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈ రోజు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో అధికార టీడీపీ వర్గీయులు, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని లాఠీ ఛార్జి చేశారు. పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. టీడీపై, వైసీపీ వర్గీయులు ఎందుకు ఘర్షణ పడాల్సి వచ్చిందన్న విషయంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.