: సరికొత్త రూపు సంతరించుకున్న ట్విట్టర్!
ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల హవా ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీల నుంచి సామాన్య మానవుడి వరకు సోషల్ మీడియాను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయాలన్నా, తమకు నచ్చని విషయాలు చెప్పేయాలన్నా, ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలన్నా అందరూ సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా అయితే.. అమెరికా అధ్యక్షుడి నుంచి ఎన్నో దేశాల అధ్యక్షులు తమ అభిప్రాయాలను ప్రతిరోజు తెలుపుతున్నారు. తమకున్న పాప్యులారిటీకి అనుగుణంగానే ట్విట్టర్ తమ ఫీచర్‌లను మార్చుతూ ప్రజల్లోకి మరింత వెళ్లాలని చూస్తోంది.
ఈ క్రమంలోనే ట్విట్టర్ సరికొత్త రూపును సంతరించుకుంది. స్మార్ట్‌ఫోన్‌లలో వాడే తమ యాప్‌ను మరింత ఆకర్షణీయంగా రూపొందించడమే కాక మరిన్ని ఫీచర్స్‌ను జోడించింది. డెస్క్‌టాప్‌ల్లో ఉపయోగించే వెర్షన్‌కు కూడా కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న రీట్వీట్, రిప్లై, హార్ట్ ఐకాన్స్‌ను మరింత స్పష్టంగా కనపడేలా చేసింది. అదే సమయంలో వాటి పరిమాణాన్ని తగ్గించింది. తమ యూజర్ల ఫ్రొఫైల్ అవతార్‌ను వృత్తాకారంగా మార్చేసింది. ఆండ్రాయిడ్ వెర్షన్‌లో హెడింగ్స్‌ను కొంచెం బోల్డ్‌గా చేసింది. స్క్రీన్‌పై ఫాంట్ కన్పించే విధానం ఆకర్షణీయంగా ఉండేట్లు చేసింది.