: టీఆర్ఎస్ లో చేరాక నేను సెంటు భూమి కొన్నానని నిరూపిస్తే.. ఉత్తమ్ కు రాసిస్తా!: రెడ్యానాయక్
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత రెడ్యానాయక్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాక తాను సెంటు భూమి కొన్నానని నిరూపిస్తే కనుక దానిని ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిస్తానని రెడ్యానాయక్ అన్నారు. తాను పార్టీ మారినందుకు హైదరాబాద్ లోని హఫీజ్ పేట్ లో భూమి ఇచ్చారనడం అవాస్తమని, కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరాననే దుగ్ధతోనే తనపై ఆరోపణలు చేశారని విమర్శించారు.
సర్వే నెంబర్ 80లోని భూమిని 2006 జనవరిలో కొనుగోలు చేసి 2008లో విక్రయించానని, అవి ప్రైవేట్ భూములని, అప్పుడు, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన ఉత్తమ్ కు విజ్ఞత ఉంటే క్షమాపణ చెప్పాలని, ఆయన కన్నా తాను సీనియర్ ని అని, తనపై ఎలాంటి మచ్చ లేదని రెడ్యానాయక్ అన్నారు.