: జాదవ్‌ కేసును వాయిదా వేయలేదని అంతర్జాతీయ న్యాయస్థానం మాకు చెప్పింది: పాక్‌


భారత నావికాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్ త‌మ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడంటూ పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఆయ‌న‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించిన‌ పాకిస్థాన్‌... తాజాగా త‌మ‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) నుంచి ఓ లేఖ వ‌చ్చింద‌ని తెలిపింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసు విచారణను డిసెంబరు వరకు వాయిదా వేయాలని భారత్ చేసిన‌ అభ్యర్థనను తిరస్కరించినట్లు ఆ లేఖ‌లో ఐసీజే పేర్కొంద‌ని పాక్‌ అటార్నీ జనరల్‌(ఏజీ) అష్తర్‌ అసఫ్‌ అలీ త‌మ‌కు తెలిపినట్లు పాక్‌ పత్రిక డాన్ పేర్కొంది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ మరణశిక్షపై కొన్ని రోజుల క్రితం ఐసీజే స్టే విధించిన విష‌యం తెలిసిందే.         

  • Loading...

More Telugu News