: అందుకే బ్యూటీషియన్ శిరీష శరీరంపై గాయాలు అయ్యాయి: సీపీ మహేందర్ రెడ్డి వివరణ
హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు గురించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి వివరాలు తెలిపారు. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయని పోస్టుమార్టం నివేదికలో తేలిన విషయం తెలిసిందే. శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఆమె శరీరంపై ఆ గాయాలు ఎలా అయ్యాయని అడిగిన ప్రశ్నకు సీపీ మహేందర్ రెడ్డి సమాధానం చెబుతూ... కుకునూర్ పల్లిలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన రూంలో శిరీషతో అసభ్యంగా ప్రవర్తించగా ఆమె భయపడిపోయి, అరుపులు పెట్టిందని, అదే సమయంలో రూం లోపలికి వచ్చిన రాజీవ్ ఆమెను అరవకూడదని కొట్టాడని తెలిపారు. అనంతరం ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకునే క్రమంలో, శిరీష కారులోంచి బయటకు దూకేందుకు ప్రయత్నించిన సమయంలో రాజీవ్ ఆమెపై దాడి చేశాడని చెప్పారు. హైదరాబాద్ కు వచ్చే వరకు శిరీషను రాజీవ్ అదుపుచేస్తూనే ఉన్నాడని చెప్పారు. ఈ కారణంగానే శిరీష శరీరంపై ఆ గాయాలు అయ్యాయని తెలిపారు.