: వేగంగా వెళుతున్న కారులోంచి రోడ్డుపైకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు!
ఓ వ్యక్తి ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకున్న ఘటన చైనాలోని గౌంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న డాంగ్ గౌన్ లో చోటు చేసుకుంది. అక్కడి సీసీ కెమెరాలో రికార్డైన ఈ ఘటన దృశ్యాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో కారును డ్రైవ్ చేస్తూ వెళుతున్న ఓ వ్యక్తి తన కారులో ఒక్కసారిగా మంటలంటుకోవడాన్ని గమనించాడు. దీంతో వెంటనే ఆ కారులోంచి నడిరోడ్డుపైకి దూకేశాడు. కొన్ని సెకండ్లలోనే ఆ కారు మంటల్లో కాలిపోయి దగ్ధమైంది. కారు ఇంజన్ లో మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఆ కారులోని వ్యక్తి కారులోంచి దూకలేకపోయినా, దూకడంలో ఆలస్యం చేసినా ఆ కారులోనే ప్రాణాలు కోల్పోయేవాడు. ఆ కారు మంటలు వేరే వాహనాలకు కూడా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.