: జేసీ సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి: వైసీపీ నేత కేతిరెడ్డి డిమాండ్
జేసీ సోదరుల ఆగడాలపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయ కర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. జేసీ సోదరులను టీడీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎయిర్ పోర్ట్ లో ఏ తప్పు చేయకుండానే వైఎస్సార్సీపీ ఎంపి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని నాటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
నిన్న విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో దాడికి పాల్పడ్డ జేసీని మాత్రం అరెస్ట్ చేయరా? అని పెద్దారెడ్డి ప్రశ్నించారు. కాగా, జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ కు ముందుగానే తాను చేరుకున్నానని జేసీ చెప్పినప్పటికీ, సీసీటీవీ ఫుటేజ్ లో దానికి సంబంధించిన ఆధారాలు లేవని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొనడం విదితమే.