: మీరు కడుతున్న డ్యాం వల్ల మాకు ముప్పు: చంద్రబాబుకు తమిళనాడు సీఎం లేఖ
ఏపీ సీఎం చంద్రబాబుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఓ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యాంతో తమ రాష్ట్రానికి నీటి ఇబ్బందులు వస్తాయని పళనిస్వామి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కుసా నదితో పాటు ఉపనదులపై ఎటువంటి అనుమతులు లేకుండా చెక్ డ్యామ్ నిర్మిస్తున్నారని పళనిస్వామి ఆరోపించారు.