: ‘జబర్దస్త్ వీడియో.. మజా ఆగయా’ అంటున్న శిఖర్ ధావన్


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కి భారత్ చేరడంపై ఆనందం వ్యక్తం చేస్తూ టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘జబర్దస్త్ వీడియో.. మజా ఆగయా’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో శిఖర్ పోస్ట్ చేశాడు. ప్రముఖ భోజ్ పురి పాటకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్ లు డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనపడతారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది. కాగా, నిన్న జరిగిన రెండో సెమీఫైనల్స్ లో బంగ్లాదేశ్ ను భారత్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. రేపు జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది.

  • Loading...

More Telugu News