: శిరీషకు, రాజీవ్ కు శారీరక సంబంధం ఉంది: సీపీ మహేందర్ రెడ్డి
బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ కేసును వెస్ట్ జోన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారని చెప్పారు. ఈ క్రమంలో శిరీష మరణానికి కారణమైన రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల క్రితం సతీష్ చంద్ర అనే వ్యక్తిని శిరీష పెళ్లి చేసుకుందని... వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉందని ఆయన చెప్పారు. ఆమె పెట్టిన బ్యూటీ పార్లర్ బిజినెస్ లాభదాయకంగా లేని సమయంలో, ఆమెకు వల్లభనేని రాజీవ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం అయిందని తెలిపారు. ఎంబీయే చదివిన రాజీవ్ ఆర్జే ఫొటో గ్రాఫర్స్ అనే స్టూడియోను పెట్లుకున్నాడని... వెడ్డింగ్ ప్లానర్ గా పెళ్లికార్యక్రమాలను కూడా నిర్వహించేవాడని చెప్పారు. గత నాలుగేళ్లుగా రాజీవ్ తో కలసి శిరీష పనిచేస్తోందని... ఈ క్రమంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని చెప్పారు.