: దివాకర్ రెడ్డి చెప్పింది తప్పు: అశోక్ గజపతి రాజు
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో, జేసీపై ఏడు ఎయిల్ లైన్స్ కంపెనీలు నిషేధం విధించాయి. ఈ క్రమంలో ఈ వివాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ఎయిర్ పోర్టుకు గంట ముందే వచ్చానని దివాకర్ రెడ్డి చెప్పారని... కానీ, సీసీటీవీ ఫుటేజీలో అది అవాస్తవమని తేలిందని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మరోవైపు, చిన్న చిన్న విషయాలు కూడా పార్టీ పరువును దిగజారుస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.