: ల్యాప్ టాప్ కేబుల్ కొరికిందని.. కుక్క పిల్లపై ప్రతాపం చూపిన ఆఫ్రికన్!


నాలుగు నెలల వయసున్న కుక్కపిల్లకు ఏం తెలుసని...? కానీ, ఓ ఆఫ్రికన్ మాత్రం ఆ విచక్షణను మరిచిపోయాడు. తన ల్యాప్ టాప్ కేబుల్ కొరికి, దాన్ని డ్యామేజ్ చేసిందన్న కోపంతో దాన్ని మొదటి అంతస్తు బాల్కలోంచి కిందకు విసిరేశాడు. చెత్త కుప్పల్లో పడి బాధతో అరుస్తున్న ఆ కుక్క పిల్లను అరవింద్ కుమార్ అనే వ్యక్తి గమనించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దాంతో అది సంచలనంగా మారింది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఓ స్వచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

  • Loading...

More Telugu News