: రష్యా దాడుల్లో ఐసిస్ అధినేత బాగ్దాదీ హతం?
ప్రపంచంలోని పలు దేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బకర్ అల్-బాగ్దాదీ హతమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. సిరియా నగరమైన రక్కాలో రష్యా వాయు సేన జరిపిన దాడుల్లో బగ్దాదీ దుర్మరణం పాలయ్యాడని రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. బాగ్దాదీ మరణించాడా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించే పనిలో రష్యా రక్షణ శాఖ ఉందని తెలిపాయి. మే 28వ తేదీన ఐసిస్ అగ్రనేతలు సమావేశమైనప్పుడు ఈ దాడులు జరిగాయని పేర్కొన్నాయి.
వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఆ సమావేశంలో బాగ్దాదీ కూడా ఉన్నట్టు రష్యా రక్షణ శాఖ భావిస్తున్నట్టు ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.