: హేమమాలిని బుగ్గల్లాంటి రహదారులట!
నేతలు ప్రచారం కోసం బాలీవుడ్ తారలను ఎలా ఉపయోగించుకుంటారో మరోసారి రుజువైంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ తమ రాష్ట్రంలోని రహదారులను హేమమాలిని బుగ్గలతో పోల్చారు. హేమమాలినిలా రహదారులు మెరిసిపోతున్నాయంటూ అక్కడి పత్రికలలో మంత్రి గారి మద్దతుదారులు భారీగా ప్రకటనలు ఇవ్వడం మరోసారి చర్చకు తావిచ్చింది. విశేషమేమిటంటే, హేమమాలిని బుగ్గలు రహదారుల అభివృద్ధి ప్రమాణాలకు ఒక సూచికగా మారిపోయాయనడంలో ఆశ్చర్యం లేదు.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ మంత్రి రాజారామ్ పాండే కూడా ప్రతాప్ గఢ్ జిల్లాలో రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చి పదవిని ఊడగొట్టుకున్నాడు. లోగడ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ కూడా ఇలానే తనకు అధికారమిస్తే రాష్ట్రంలో రహదారులను హేమమాలిని చెంపల్లా నున్నగా మారుస్తానని హామీలు ఇచ్చి ఉన్నారు మరి. నేతల నోర్లా... మజాకా?