: బ్యూటీషియన్ శిరీష మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు!
ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం అయిన బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆమెను ఎవరూ హత్య చేయలేదని, ఆమే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు విచారణలో భాగంగా రాజీవ్, శ్రవణ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు... వారి నుంచి పలు విషయాలను రాబట్టారు. కేసులో నిందితురాలైన తేజశ్విని నుంచి కూడా వివరాలను సేకరించారు. అంతేకాకుండా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన వివరాల ఆధారంగా దర్యాప్తును పూర్తి చేశారు. కాసేపట్లో మీడియాకు పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. మెడ భాగంలో తీవ్ర ఒత్తిడి కారణంగానే ఆమె చనిపోయినట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనే ఫ్యాన్ కు ఉరివేసుకుందని పోలీసులు నిర్ధారించారు.