: బ్యూటీషియన్ శిరీష మృతిపై సీఎం కేసీఆర్ కు ఇచ్చిన నివేదికలో పోలీసులు ఏమని పేర్కొన్నారంటే...!
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆర్జీఏ స్టూడియోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష ఘటనలో రిపోర్టును ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోలీసు అధికారులు అందజేశారని సమాచారం. సీఎంకు అందజేసిన నివేదికలో శిరీషది అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. పోస్టు మార్టం నివేదిక, విచారణలో లభించిన ఆధారాలతో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారించారు.
శిరీష ఆత్మహత్యకు ప్రధాన కారణం రాజీవ్, శ్రావణ్ అని పోలీసులు తేల్చి చెబుతున్నారు. అలాగే ఈ కేసులో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. శిరీష మరణానికి సంబంధించిన కీలక సాక్ష్యాన్ని పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది....ఈ కేసులో పూర్తి వివరాలు వెల్లడిస్తూ మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పోలీసులు సీఎంకు తెలిపినట్టు తెలుస్తోంది.