: ఇంటరాగేషన్ లో శిరీష మృతిపై రాజీవ్ ఏం చెప్పాడంటే...!


హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన మేకప్ ఆర్టిస్టు శిరీష ఘటనలో జరిగిన ఇంటరాగేషన్ లో రాజీవ్, శ్రావణ్ నోరువిప్పారు. ఈ సందర్భంగా రాజీవ్ పోలీసులకు పలు విషయాలు వివరించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో తేజస్విని కేసు పెట్టిన అనంతరం శ్రావణ్ కారణంగా శిరీషకు ఎస్సై ప్రభాకర్ రెడ్డి పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో కేసు మాఫీ చేయిస్తానంటూ శిరీషకు ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.

దీంతో పలు మార్లు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి కేసు లేకుండా చూశారు. దీంతో ప్రభాకర్ కు పార్టీ ఇద్దామని భావించి కాఫీ షాపులో హుక్కా తాగి, కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. మద్యంతాగి పార్టీ చేసుకున్నారు. పార్టీ మధ్యలో శిరీషపై ప్రభాకర్ రెడ్డి లైంగికదాడి యత్నం చేశారు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో రాజీవ్ ఆమెపై దాడి చేశాడు. మార్గమధ్యంలో కూడా కారులో రాజీవ్ ఆమెపై దాడి చేశాడు. దీంతో అవమానం భరించలేకపోయిన శిరీష స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడింది. టీవీ చానెల్స్ కథనాల ప్రకారం..  ఇవీ ఇంటరాగేషన్ లో రాజీవ్, శ్రావణ్ పోలీసులకు వెల్లడించిన వివరాలు. 

  • Loading...

More Telugu News