: నన్ను గబ్బుపట్టించారంటూ మీడియాపై చిందులు తొక్కిన జేసీ... సమస్య పరిష్కారానికి సీఎం రమేష్ రంగప్రవేశం!


తనను గబ్బు పట్టించారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాపై చిందులు తొక్కారు. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఉద్యోగిని ముందుకు నెట్టిన జేసీపై ఐదు విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. జేసీ వ్యవహార శైలి వివాదాస్పదం కావడంతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగారు. సీఎం రమేష్ అనంతపురంలోని జేసీ నివాసానికి వెళ్లారు. జాతీయ స్థాయిలో పెను వివాదంగా మారకముందే జేసీతో క్షమాపణలు చెప్పించేందుకు ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ప్రతిష్ఠను దిగజార్చారని జేసీ మీడియాపై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News