: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ భగవతి కన్నుమూత
న్యాయవ్యవస్థలో మైలురాయిగా పేర్కొనే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రారంభించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్.భగవతి (96) కన్నుమూశారు. గత కొంత కాలంగా వయసుపైబడడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి 8 గంటల సమయంలో ప్రాణాలు విడిచారు. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్న ఆయన 1967లో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఎమర్జెన్సీ సమయంలో ఆర్టికల్ 4ను సమర్థించిన ఏకైన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. 1985లో సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, 1986 డిసెంబర్ 20న పదవీ విరమణ చేశారు. దిగ్గజ న్యాయకోవిదునిగా పేరున్న ఆయన మరణం పట్ల పలువురు న్యాయమూర్తులు, న్యాయనిపుణులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.