: బ్యూటీషియన్ శిరీష మృతి కేసు నిందితుడు రాజీవ్ ది నేరస్వభావం... ప్లేబోయ్ మనస్తత్వం!: స్థానికులు


హైదరాబాదులోని ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష ఘటనలో ప్రధాన నిందితుడు రాజీవ్ గురించిన పలు విషయాలను స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆర్జీఏ స్టూడియోకు పోలీసులు రాజీవ్, శ్రావణ్ ను తీసుకెళ్లారు. అక్కడ వీరిని విచారిస్తూ, వీరి గురించి చుట్టుపక్కల ఆచూకీ తీశారు.

ఈ సందర్భంగా పలువురు స్థానికులు రాజీవ్ వ్యవహార శైలి గురించి తెలిపారు. దీంతో రాజీవ్ ది నేరస్వభావమని పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా అతడిది ప్లేబోయ్ మనస్తత్వమని, తరచు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చేవాడని స్థానికులు తెలిపారు. తేజస్వినితో ప్రేమలో పడి శిరీషను వదిలించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. గతంలో కూడా శిరీషతో రాజీవ్ ఘర్షణ పడ్డాడని గుర్తించారు. ఆ అపార్ట్ మెంట్ చుట్టూ సీసీ కెమెరాలు అమర్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News