: నిజాంపేటలో తప్పిపోయిన పూర్ణిమ సాయి చెన్నైలో ఉంది!: బాచుపల్లి పోలీసులకు అజ్ఞాతవ్యక్తి ఫోన్‌


హైదరాబాదులోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ నుంచి అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి(15) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన స్కూల్ కు వెళ్లిన పూర్ణిమ సాయి ఆ తరువాత ఇల్లు చేరలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. 14 బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసంగా గాలింపు చేపట్టారు. అయితే, ఆమెకు సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా లభించకపోవడంతో సోషల్ మీడియాలో బాలిక ఫోటో పోస్టు చేశారు.

ఈ ఫోటోలు చూసిన అజ్ఞాత వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫోన్ చేసి, అదృశ్యమైన పూర్ణిమ సాయి చెన్నై బస్టాండ్‌ లో స్కూల్‌ యూనిఫారమ్‌ ధరంచి ఉందని, ఆమె వెనుక 16 ఏళ్ల వయస్సుగల బాలుడు కూడా ఉన్నాడని తెలిపాడు. దీంతో వేగంగా స్పందించిన పోలీసులు చెన్నైలో పూర్ణిమ సాయి బంధువుల వివరాలు సేకరిస్తూ... పూర్ణిమ కోసం గాలించేందుకు ఒక టీమ్ ను పంపించారు.

  • Loading...

More Telugu News