: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ....కుక్క ఎవరు?...పులి ఎవరు?: బంగ్లా నెటిజన్లపై ఇండియా నెటిజన్ల సెటైర్!


బంగ్లాదేశ్ పై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం ఒక వికెట్ కోల్పోయిన భారత జట్టు బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయం సాధించింది. దీంతో సోషల్ మీడియా వార్ లో టీమిండియా అభిమానులు విజయం సాధించారు. మ్యాచ్ కు ముందు వక్రబుద్ధిని బయటపెట్టుకుంటూ బంగ్లా అభిమానులు టీమిండియాను కుక్కతో పోల్చుతూ, బంగ్లాదేశ్ ను పులితో పోలుస్తూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు.

దీంతో టీమిండియా అభిమానులు కూడా దీటుగా స్పదించారు. కొద్ది గంటల్లో పులి ఎవరో, కుక్క ఎవరో తేలిపోనుందంటూ సమాధానం ఇచ్చారు. బంగ్లాదేశ్ ను 9 వికెట్ల తేడాతో ఓడించడంతో....సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు...ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ! పులి ఎవరు? కుక్క ఎవరు? అంటూ బంగ్లాదేశ్ అభిమానులను ఎద్దేవా చేస్తున్నారు.

  • Loading...

More Telugu News