: అదరగొట్టేశారు.. రోహిత్ శర్మ సెంచరీ.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న సైమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. 89 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యంతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా, అంతకు ముందు విరాట్ కోహ్లీ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 33 ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 212 పరుగులుగా ఉంది. టీమిండియా విజయానికి మరో 17 ఓవర్లలో 53 పరుగులు చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మోర్తాజాకు ఒక వికెట్ దక్కింది. శిఖర్ ధావన్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయిన విషయం తెలిసిందే.