: ట్రాక్ పై విరిగిపడ్డ బండరాళ్లు.. కిరండోల్ ప్యాసింజర్ రైలు నిలిపివేత


వర్షాల కారణంగా విశాపట్టణం జిల్లాలోని చిముడుపల్లి-టైడా, కొత్తవలస-కిరండోల్ రైల్వే మార్గాల్లో ట్రాక్ పై బండరాళ్లు విరిగి పడ్డాయి. దీంతో కిరండోల్ ప్యాసింజర్ రైలును బొర్రా రైల్వేస్టేషన్ లో అధికారులు నిలిపివేశారు. ట్రాక్ పై బండరాళ్లు పడటంతో పలు గూడ్స్ రైళ్లు ఆగిపోయాయి. దీంతో, రైల్వే ట్రాక్ పై పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించగానే ఆయా మార్గాల్లో రైళ్లు తిరుగుతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News