: క్రీజులో పాతుకుపోయి ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న సైమీ ఫైనల్ మ్యాచులో ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టేస్తున్నారు. బంగ్లాదేశ్ ఇచ్చిన 265 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 34 బంతుల్లో 46 పరుగులు చేసి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ క్రీజులో పాతుకుపోయి 84 బంతుల్లో 81 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కోహ్లీ 40 పరుగులు పూర్తి చేసుకుని హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 25 ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 164 పరుగులుగా ఉంది. టీమిండియా విజయానికి మరో 25 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉంది.