: వేసవిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నభక్తుల సంఖ్య ఎంతంటే..!
తిరుమల.. నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా సెలవులు, పర్వదినాలు వచ్చాయంటే భక్తుల రద్దీ మరింత గా పెరుగుతుంది. ఈ ఏడాది వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని భక్తులు అధిక సంఖ్యలోనే దర్శించుకున్నారు. ఈ విషయాన్ని తిరుమల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. వీఐపీ దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించామన్నారు. వేసవి సెలవుల్లో మొత్తం 41,33,000 మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 1.94 కోట్ల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశామని, 19 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, గదుల కేటాయింపు పెంచామని, శ్రీవారి హుండీ ఆదాయం రూ.122 కోట్లు వచ్చిందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో పది శాతం మంది భక్తులకు అధికంగా అన్న ప్రసాదాలను అందించామని తెలిపారు.