: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా


చాంపియ‌న్స్ ట్రోఫీ సైమీ ఫైన‌ల్ పోరులో బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డుతున్న టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ ఒక సిక్స‌ర్‌, ఏడు ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 46 ప‌రుగులు సాధించిన టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. బంగ్లా ఆట‌గాడు మోర్టాజా బౌలింగ్‌లో షాట్‌కు ప్ర‌య‌త్నించి మొస‌ద్దెక్‌కి క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. అనంత‌రం క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వ‌చ్చాడు. మ‌రో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 41 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 15 ఓవ‌ర్ల‌కి ఒక వికెట్ న‌ష్టానికి 87 ప‌రుగులుగా ఉంది.     

  • Loading...

More Telugu News