: ఉద్యోగ భద్రత లేని నగరాల జాబితాలో హైదరాబాద్!


ఒక ఉద్యోగిని ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ఆయా సంస్థలు చెప్పే ప్రధాన కారణాలలో మొదటిది.. సంస్థ ఆర్థిక పరిస్థితి. రెండోది.. ఉద్యోగి లేదా ఉద్యోగిని పర్ఫార్మెన్స్. ఇవే కాకుండా, సదరు ఉద్యోగి పని చేస్తున్న స్థలం, పని చేసే ఇండస్ట్రీ కూడా వారిని తొలగించేందుకు కారణాలు కావచ్చు.

టైర్-1 సిటీలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో పని చేసే వారికి ఉద్యోగ భద్రత చాలా తక్కువట. ఈ విషయం ఓ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. ఏయే నగరాల్లో ఉద్యోగ భద్రతకు సంబంధించి ఉద్యోగులు రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయమై అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, ముంబయి, పూణెలలో సర్వే నిర్వహించారు. నగరం, సెక్టార్, ప్రొఫైల్ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికల ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు సర్వేలో వెల్లడయ్యాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఉద్యోగ భద్రత అంతగా లేని నగరంలో మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బెంగళూరు, హైదారాబాద్, అహ్మదాబాద్, ముంబై, చండీగఢ్, చెన్నై, కోల్ కతా, పుణె ఉన్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడమనేది ఆయా ఇండస్ట్రీలనూ అనుసరించి ఉంటుంది. ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరింగ్, అలైడ్ సెక్టార్స్ లో పని చేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి.

 ఆ తర్వాతి స్థానాల్లో కన్ స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్, బీపీఓ అండ్ ఐటీ రంగాల్లో సేవలందించే సంస్థలు ఉన్నాయి. హెల్త్ కేర్, టెలికామ్ రంగాల్లో పని చేసే వారు నిర్భయంగా పని చేసుకోవచ్చు. జాబ్ రిస్క్ ఇండెక్స్ లో ఈ రెండు రంగాలు చివరలో ఉన్నాయి. లో-రిస్క్ ఉన్న రంగాల్లో ఇంకా.. రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ అండ్ డ్యూరబుల్ గూడ్స్, పవర్ అండ్ ఎనర్జీ, అగ్రికల్చర్, ఆగ్రో కెమికల్స్ సంస్థలు ఉన్నాయి. ఆటోమొబైల్, మీడియా, ఎంటైర్ టెయిన్ మెంట్ రంగాల్లో జాబ్ రిస్క్ తగుమాత్రంగా ఉన్నట్టు ఆ సర్వేలో పేర్కొంది.

  • Loading...

More Telugu News