: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
ఈ రోజు అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. లీటర్ పెట్రోల్‌పై రూ.1.12 పైసలు, డీజిల్‌పై రూ.1.24 పైసలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ‘ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ రేట్ల మార్పు’పై పెట్రోల్ డీలర్లు అంగీకరించారు. రేపటి నుంచే రోజువారీ ధరలను అమలు చేయనున్నారు. ఇందుకు కొన్ని గంటల ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు తెలపడం విశేషం.