: ఛాంపియన్స్ ట్రోఫీ అప్ డేట్స్: దూకుడుగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు


ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు కొన‌సాగుతున్న రెండో సెమీ ఫైన‌ల్‌ మ్యాచులో బంగ్లాదేశ్ ఇచ్చిన‌ 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్‌ ధావ‌న్‌లు చూడ‌చ‌క్క‌ని షాట్ల‌తో బంగ్లాదేశ్ బౌల‌ర్లు వేస్తోన్న బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లిస్తున్నారు. శిఖ‌ర్ ధావ‌న్ ఒక సిక్సర్‌, ఐదు ఫోర్ల సాయంతో 20 బంతుల్లో 32 ప‌రుగులు చేశాడు. రోహిత్ శ‌ర్మ ఐదు ఫోర్లు బాది 37 బంతుల్లో 31 ప‌రుగులు చేశాడు. దీంతో 10 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి టీమిండియా స్కోరు వికెట్ న‌ష్ట‌పోకుండా 63 పరుగులుగా ఉంది. 

  • Loading...

More Telugu News