: తన ఇద్దరు పిల్లలతో పాటు చెరువులో దూకి యువతి ఆత్మహత్య
తన ఇద్దరు పిల్లలతో పాటు సంతోషి (23) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం తండాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించారు. పెద్దగూడంలో నివాసం ఉండే సంతోషి తన కుటుంబంలో తలెత్తుతోన్న కలహాలతో కలతచెంది తన ఇద్దరు పిల్లలు మోక్షిత్(4), వివేక్(3)లను చెరువులో పడేసి, అనంతరం ఆమె కూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.