: ఎల్లుండి నా కొత్త సినిమా ట్రైలర్ విడుదల: హీరో నాని
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త చిత్రం ‘నిన్ను కోరి’ టీజర్‌ను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలను కూడా ఆ సినిమా యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేస్తూ వస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీ ఎప్పుడో నాని చెప్పాడు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ‘నిన్ను కోరి’ ట్రైలర్ రిలీజ్ కానుందని పేర్కొంటూ ఈ సినిమాలోని తన మరో లుక్‌ను పోస్ట్ చేశాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చేనెల 7న విడుదల కానుంది. ఇటీవల విడులైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.