: బ్యూటీషియన్ శిరీష మరణం.. షాకింగ్ నిజాలను వెల్లడించిన ఫోరెన్సిక్ నివేదిక
బ్యూటీషియన్ శిరీష మరణానికి సంబంధించిన పలు సంచలన విషయాలు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యాయి. మెడపై బలమైన ఒత్తిడి పడటం వల్లే ఆమె చనిపోయిందని రిపోర్టులో షాకింగ్ నిజం వెలుగుచూసింది. ఆమె పెదవి, చెంపలు, తలపై గాయాలున్నాయని ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆమె హిప్ భాగంలో కూడా బలమైన గాయమున్నట్టు వెల్లడైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వివరాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, శిరీషది ఆత్మహత్య అయితే... ఆమె ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.