: రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్: మూడవ వికెట్ కోల్పోయిన బంగ్లా
తమ జట్టు ఆటగాళ్లు సౌమ్య (0), షబ్బిర్ (19) తక్కువ పరుగులకే అవుటైన వేళ క్రీజులో పాతుకుపోయి ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్ మరో ఓపెనర్ తమీమ్‌ను 70 (82బంతుల్లో) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత బౌలర్ జాధవ్ పెవీలియన్‌కు పంపించాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రహీమ్ కూడా ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. తమీమ్ అవుటైన తరువాత క్రీజులోకి షాకిబ్ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో రహీమ్ 54, షాకిబ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీయగా జాధవ్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ స్కోరు 30 ఓవర్లు ముగిసే సమయానికి 161/3 గా ఉంది.