: ఈ ఫొటోను నేను పోస్ట్ చేశానా?: సమంత


దక్షిణాది బ్యూటీ సమంత చిన్నప్పటి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో చిన్నారి సమంత చేతులను పట్టుకుని మరో ఇద్దరు చిన్నారులు ఆమెకు అటూఇటూ నిలబడ్డారు. ఈ ఫొటోలో ఇద్దరు చిన్నారులు నవ్వులు చిందిస్తుండగా, చిన్నారి సమంత చిరునవ్వుతో ఫొటోకు పోజిచ్చింది. ఈ ఫొటోపై సమంత స్పందిస్తూ..‘ఈ ఫొటోను నేను పోస్ట్ చేశానా?’ అని తెలిపింది. కాగా, అక్కినేని నాగచైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న గోవాలో జరగనుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో జరగనున్న ఈ వివాహానికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News