: ఛాంపియన్స్ ట్రోఫీ: రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తోన్న బంగ్లాదేశ్ 31 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మొదటి ఓవరు 6వ బంతిలో బంగ్లా ఓపెనర్ సౌమ్య భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డకౌట్ గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన షబ్బిర్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అదే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆరవ ఓవర్ నాలుగవ బంతికి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ టనిమ్ 8 పరుగులతో ఉన్నాడు. షబ్బిర్ అవుటయిన తరువాత క్రీజులోకి రహీమ్ వచ్చాడు. ఆరు ఓవర్లు ముగిసేనాటికి బంగ్లాదేశ్ స్కోరు.. రెండు వికెట్ల నష్టానికి 32గా ఉంది.