: పుణెలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుళ్లు... ఇద్దరు దుర్మరణం!


మహారాష్ట్రలోని పుణె పట్టణంలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రోజు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొంత మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. రక్షణ శాఖ పరిధిలోని ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశంలో ఎంతో కాలంగా ఉన్న వాటిలో ఒకటి. 1920లో ఇక్కడ తయారీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పుణెలోని ఖడ్కి వద్ద ఇది ఉంది. రాత్రి పూట యుద్ధం చేసేందుకు వీలుగా సైన్యం, భద్రతా బలగాలకు అవసరమైన ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.

  • Loading...

More Telugu News