: జయలలిత విష్ణుమూర్తి 11వ అవతారం: ఎమ్మెల్యే మరియప్పన్ కెన్నెడీ
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విష్ణుమూర్తి 11వ అవతారమట. అన్నాడీఎంకే ఎమ్మెల్యే మరియప్పన్ కెన్నెడీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇక కర్ణాటక జైల్లో మగ్గుతున్న వీకే శశికళ జయలలిత స్థానాన్ని భర్తీ చేయగలరని, శశికళ వరుసకు కుమారుడు అయిన దినకరన్ అన్నాడీఎంకే పార్టీకి చుక్కాని అని కెన్నెడీ అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీలో గురువారం జరిగిన ఓ చర్చ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడడం విశేషం. దీనిపై ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. కెన్నెడీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు.