: ఆటో ఎక్కి ఇంటికెళ్లిన సల్మాన్.. ఆశ్చర్యపోయిన డ్రైవర్!


బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తన గొప్పతనాన్ని మరోమారు చాటుకున్నాడు. తన సోదరుడు సొహైల్ ఖాన్ పుట్టినరోజు వేడుకల కోసం సల్మాన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ముంబైలో బయటకు వెళ్లారు. బర్త్ డే వేడుక ముగియగానే సల్మాన్ ఖాన్ తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం కారులో కాకుండా ఆటో ఎక్కాడు. ఆటోలో సల్మాన్ ఇంటికి చేరుకునేసరికి అయిన మీటరు ఛార్జి రూ.50. అయితే, సల్మాన్ మాత్రం రూ.1000 ఇవ్వడంతో డ్రైవర్ ఆశ్చర్యపోయాడు.

ఆటోడ్రైవర్ సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఆటోలో ఎక్కిన సల్మాన్ ఏం మాట్లాడలేదని, వేగంగా వెళ్లమని మాత్రం చెప్పాడని అన్నారు. సల్మాన్ ను ఇంటి దగ్గర దింపాక, ఆయన డ్రైవర్ తో మాట్లాడమని తనకు చెప్పారని తెలిపాడు. సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ తన చేతిలో రూ.1000 పెట్టి చిరునవ్వు చిందించారని సంజయ్ కుమార్ సింగ్ చెప్పుకొచ్చారు. కాగా, సల్మాన్ ఖాన్ ఆటో ఎక్కి ఇంటికి వెళ్లడం ఇదేమీ మొదటిసారికాదు. గతంలో కూడా ఈ విధంగా సల్మాన్ ఇంటికి చేరిన సందర్భాలు ఉన్నాయి. 

  • Loading...

More Telugu News