: తిరుపతి కెఎంఎం కళాశాల వద్ద కలకలం.. విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు
తిరుపతి కెఎంఎం కళాశాల వద్ద ఈ రోజు మధ్యాహ్నం కలకలం చెలరేగింది. ఓ విద్యార్థినిపై గుర్తు తెలియని యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు గాయాలపాలయిన ఆ యువతిని దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిపై నిందితుడు ఎందుకు దాడి చేశాడన్న విషయం గురించి తెలియాల్సి ఉంది. ఆ విద్యార్థినికి ఎటువంటి ప్రమాదం లేదని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఆ విద్యార్థిని కెఎంఎం కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు.