: ఆప్ కు సొంత ప్రభుత్వమే ఝలక్... అద్దె కట్టమంటూ నోటీసు
కేజ్రీవాల్ సారధ్యంలోని ఢిల్లీ సర్కారు సొంత పార్టీ ఆమ్ ఆద్మీకి ఝలక్ ఇచ్చింది. ఉత్తర ఢిల్లీలోని ప్రభుత్వ భవనం రౌస్ అవెన్యూను పార్టీ కార్యాలయానికి వాడుకుంటున్నందుకు రూ.27,73,802 కట్టాలని కోరుతూ ఢిల్లీ ప్రజాపనుల శాఖ నోటీసు జారీ చేసింది. జరిమానాతో కలిపి వాస్తవ అద్దెకు ఇది 65 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుత నోటీసులో పేర్కొన్న మొత్తం ఇప్పటివరకు కట్టవలసిన మొత్తమని, భవనాన్ని ఖాళీ చేసేంతవరకు ఇది పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. దీనిపై న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆప్ పేర్కొంది. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన కమిటీ ఆప్ కు భవనం కేటాయింపులో అవకతవకలు జరిగాయని లోగడ తేల్చింది.