: ఆర్ కామ్ 4జీ ఆఫర్లు మరింత చౌక


రిలయన్స్ జియో పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో భాగంగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తాజాగా 4జీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను 28 శాతం మేర తగ్గించేసింది. ప్రస్తుతమున్న రూ.699, రూ.499, రూ.299 ప్లాన్లు ఇకపై రూ.499, రూ.399, రూ.239కే పొందొచ్చని ఆర్ కామ్ వెల్లడించింది. rcom-eshop.com సైట్ నుంచి ఈ ఆఫర్ల ప్రయోజనాలు పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ముంబై, మహరాష్ట్ర, మధ్య ప్రదేశ్ సర్కిళ్లలో ఇవి అమల్లో ఉంటాయి. రూ.499 ప్లాన్ కింద 30జీబీ ఉచిత డేటా పొందొచ్చు. అన్ని నెట్ వర్క్ లకు అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. నెలలో 3,000 ఎస్ఎంఎస్ లు కూడా ఫ్రీ. రూ.399 ప్లాన్ కింద 15 జీబీ, అపరిమిత కాల్స్ అన్ని నెట్ వర్క్ లకు ఉచితం. నెలలో 3,000 ఎస్ఎంఎస్ లు ఫ్రీ. రూ.239ప్లాన్ లో 6జీబీ డేటా మాత్రమే ఉచితం.

  • Loading...

More Telugu News