: మ్యాచ్ మ్యాచ్ కి జట్టు మార్చం... పూర్తి స్థాయి జట్టుతోనే బరిలో దిగుతున్నాం: కోహ్లీ


మ్యాచ్ మ్యాచ్ కి వ్యూహాలు మారుతాయి కానీ జట్టు సభ్యులను మాత్రం మార్చమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో సెమీస్ లో జట్టు మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పూర్తి స్థాయి జట్టుతోనే బరిలో దిగుతున్నామని తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్ తో సన్నాహక మ్యాచ్ ఆడిన సంగతిని గుర్తు చేశాడు. గతంలో గెలిచిన విశ్వాసంతో బరిలో దిగుతామని చెప్పాడు. బంగ్లాదేశ్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నాడు. సెమీస్ చాలా ముఖ్యమైనదని తెలిపాడు. అయితే వార్మప్ మ్యాచ్ లో భువీ, ఉమేష్ అద్భుతంగా రాణించారని, సఫారీలతో మ్యాచ్ లో తొలి వికెట్ తీసింది అశ్విన్ అని గుర్తు చేశాడు. జట్టు మార్పుని కోరుకోవడం లేదని అన్నాడు. ఫలితంపై ఎలాంటి అంచనాలు లేవని, పూర్తి స్థాయిజట్టుతో బరిలో దిగి, అత్యుత్తమ ప్రదర్శన చేయడమే తమ ముందున్న కర్తవ్యమని కోహ్లీ చెప్పాడు.

  • Loading...

More Telugu News