: జింబాబ్వేకు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్
జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుకు బంగ్లాదేశ్ జట్టు చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఈ రోజు బులవాయో పట్టణంలో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లను కోల్పోయి 269 పరుగులు చేసింది.
ఆ తర్వాత 270 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు సగం పరుగులు చేయగానే చేతులెత్తేసింది. బంగ్లా బౌలర్ల విశ్వరూపంతో 148 పరుగులకే అన్ని వికెట్లనూ కోల్పోయి ఓటమిపాలైంది. బంగ్లా బౌలర్ జియా ఉర్ రెహ్మాన్ 5 వికెట్లు తీసుకుని జింబాబ్వే ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాట్స్ మెన్ నాసిర్ హుస్సేన్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.