: బంగ్లాదేశ్ పై అలసత్వం లేదు... ఎలాంటి జట్టునైనా మట్టికరిపించే సామర్థ్యం బంగ్లా సొంతం: కోహ్లీ


బంగ్లాదేశ్ జట్టుపై అలసత్వం ప్రదర్శించడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సెమీఫైనల్ సందర్భంగా చివరి ప్రాక్టీస్ సెషన్ ముగించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ లో అద్భుతమైన సామర్థ్యమున్న ఆటగాళ్లున్నారని చెప్పాడు. తమదైన రోజున బంగ్లాదేశ్ ఎలాంటి జట్టునైనా మట్టికరిపిస్తుందని చెప్పాడు. సెమీ ఫైనల్ ను తేలిగ్గా తీసుకోవడం లేదని, ప్రతి మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ కు కూడా సన్నద్ధమయ్యామని చెప్పాడు. ఫైనల్ గా మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యమని కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి, ఫైనల్ చేరడమే తమ ముందున్న లక్ష్యమని కోహ్లీ అన్నాడు. 

  • Loading...

More Telugu News