: టీడీపీ నుంచి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సస్పెన్షన్


ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు టీడీపీ ప్రకటించింది. అమరావతిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై సమన్వయ కమిటీ చర్చించి, పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా సమావేశ వివరాలను మంత్రి కళా వెంకట్రావు వెల్లడిస్తూ, హైదరాబాదులో భూకబ్జాలకు పాల్పడిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం విశాఖపట్టణంలో భూ కుంభకోణంపై దర్యాప్తుకు త్రిసభ్య కమిటీని వేస్తున్నట్టు తెలిపారు. ఈ సిట్ భూ కుంభకోణంలో దాగి వున్న కోణాలను వెలికి తీస్తుందని, అలాగే పార్టీ నేతల్లో బేధాభిప్రాయాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News