: గూర్ఖా జనముక్తి మోర్చా చీఫ్ ఇంట్లో భారీగా బయటపడ్డ ఆయుధాలు
గూర్ఖా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధినేత బిమల్ గురుంగ్ నివాసంలో భారీగా ఆయుధాలు, మందుగుండు బయటపడ్డాయి. కత్తులు, గొడ్డళ్లు కూడా వెలుగు చూశాయి. ఈ రోజు పోలీసులు గురుంగ్ నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో ఇవి దొరికాయి. కోల్ కతాలో ర్యాలీ సందర్భంగా పోలీసులు జీజేఎం యువ విభాగం గూర్ఖా జనముక్తి కార్యకర్తలపై లాఠీ చార్జ్, అరెస్ట్ లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హింసాత్మక చర్యల కోసమే ఆయుధాలను నిల్వచేసినట్టు పోలీసులు సందేహిస్తున్నారు. మరోవైపు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ జీజేఎం గురువారం నుంచి నిరవధిక బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు, భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు.